విజయవాడ ఎన్హెచ్ 65, లో విస్తరణలో భాగంగా గొల్లపూడి నుంచి పున్నమి ఘాట్ వరకు భారీ పై వంతెన
అమరావతి, 9 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్‌- విజయవాడ ఎన్‌హెచ్‌-65 విస్తరణలో భాగంగా గొల్లపూడి నుంచి పున్నమిఘాట్‌ వరకు భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎన్‌హెచ్‌-65 రహదారి విస్తరణ గొల్లపూడి వరకు పరిమితం చేయకుండా భవానీపురంలోని పున్నమిఘా
విజయవాడ ఎన్హెచ్ 65, లో విస్తరణలో భాగంగా గొల్లపూడి నుంచి పున్నమి ఘాట్ వరకు భారీ పై వంతెన


అమరావతి, 9 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్‌- విజయవాడ ఎన్‌హెచ్‌-65 విస్తరణలో భాగంగా గొల్లపూడి నుంచి పున్నమిఘాట్‌ వరకు భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎన్‌హెచ్‌-65 రహదారి విస్తరణ గొల్లపూడి వరకు పరిమితం చేయకుండా భవానీపురంలోని పున్నమిఘాట్‌ వరకు కొత్తగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే 4 కిమీ పొడవున పైవంతెన నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన. దీంతోపాటు ఇబ్రహీంపట్నంలోనూ ఓ పైవంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande