నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే
న్యూఢిల్లీ,09,సెప్టెంబర్ (హి.స.): ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్‌ సర్వే నిర్వ
PM Narendra Modi Addressing the gathering


న్యూఢిల్లీ,09,సెప్టెంబర్ (హి.స.): ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదాని హిమాచల్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర అధికారులను కలుసుకుంటారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వరద బాధితులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), ఆప్దా మిత్ర బృందంతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్‌ సర్వే నిర్వహించాక, గురుదాస్‌పూర్‌ చేరుకుని, సాయంత్రం 4:15 గంటలకు సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande