నందిగామ .లో ఉద్రిక్త త నెలకొంది
అమరావతి, 9 సెప్టెంబర్ (హి.స.)నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీసు శాఖ అన
నందిగామ .లో ఉద్రిక్త త నెలకొంది


అమరావతి, 9 సెప్టెంబర్ (హి.స.)నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీసు శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే, పోలీసు శాఖ అనుమతులు ఇవ్వలేదని వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని పోలీసు శాఖ చెప్పినప్పటికీ ఆ పార్టీ శ్రేణులు లెక్కచేయలేదు. RDO/ MROలను అతి కొద్ది మంది మాత్రమే కలసి వినతిపత్రం అందజేయాలని పోలీసు శాఖ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande