
అమరావతి, 01 జనవరి (హి.స.)
:పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం)కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(శుక్రవారం) నుంచి ఆయా జిల్లాల వారీగా పాసు పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మీయాకు మంత్రి అనగాని సత్య ప్రసాద్ )వెల్లడించారు. ఆ పాసు పుస్తకాల్లో తప్పులు ఉంటే ఇంటికి వచ్చి అధికారులు సరి చేస్తారని చెప్పుకొచ్చారు. రెవెన్యూ క్లినిక్‌లను అన్ని జిల్లాల్లో విస్తరించి భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని వివరించారు. ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరంగా ఉంటుందని వెల్లడించారు. భూ సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ