పుణే జర్మన్‌ బేకరీ కేసు నిందితుడి హతం
పుణే/ఢిల్లీ.3 01 జనవరి (హి.స.) జర్మన్‌ బేకరీ పేలుడు కేసులో నిందితుడు(సహ) అస్లాం షబ్బీర్‌ షేక్‌(బంటి జాహగీర్దార్) హత్యకు గురయ్యాడు. బుధవారం మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో బైక్‌పై వచ్చిన వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్‌
పుణే జర్మన్‌ బేకరీ కేసు నిందితుడి హతం


పుణే/ఢిల్లీ.3 01 జనవరి (హి.స.) జర్మన్‌ బేకరీ పేలుడు కేసులో నిందితుడు(సహ) అస్లాం షబ్బీర్‌ షేక్‌(బంటి జాహగీర్దార్) హత్యకు గురయ్యాడు. బుధవారం మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో బైక్‌పై వచ్చిన వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్‌ శాఖ ధృవీకరించింది.

జర్మన్‌ బేకరీ పేలుడు కేసులో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాది హిమాయత్ బైగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అస్లాం షబ్బీర్‌ షేక్‌ (బంటి జాహగీర్దార్‌) సహనిందితుడు. ఉగ్రవాnaanదులకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఈ పేలుడుకు సహకరించాడనే అభియోగాలు అతనిపై ఉన్నాయి. ఈ కేసులో బంటి జహగీర్దార్‌ 2010లో అరెస్టయ్యాడు కూడా. అయితే.. 2013లో బాంబే హైకోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేయగా.. అప్పటి నుంచి బయటే ఉంటున్నాడు.

4

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande