ద్విచక్ర వాహనం పై 50 పైగా పుణ్యక్షేత్రాల యాత్ర
పెనుగొండ, 10 జనవరి (హి.స.)వాసవీ పెనుగొండ గ్రామానికి చెందిన గొట్టుపల్లి పాపారావు, కుటుంబ సమేతంగా ద్విచక్ర వాహనంపై శబరిమలతో పాటు 50కి పైగా పుణ్య క్షేత్రాల యాత్ర పూర్తి చేసి శుక్రవారం స్వస్థలానికి తిరిగి వచ్చారు. గ్రామంలో మినర్వా థియేటర్‌ సమీపాన పిండి
ద్విచక్ర వాహనం పై 50 పైగా పుణ్యక్షేత్రాల యాత్ర


పెనుగొండ, 10 జనవరి (హి.స.)వాసవీ పెనుగొండ గ్రామానికి చెందిన గొట్టుపల్లి పాపారావు, కుటుంబ సమేతంగా ద్విచక్ర వాహనంపై శబరిమలతో పాటు 50కి పైగా పుణ్య క్షేత్రాల యాత్ర పూర్తి చేసి శుక్రవారం స్వస్థలానికి తిరిగి వచ్చారు. గ్రామంలో మినర్వా థియేటర్‌ సమీపాన పిండి మిల్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న పాపారావు భార్య లత, చిన్న కుమార్తె దేదీప్యలతో కలిసి గతేడాది నవంబరు 22న యాత్రకు బయలుదేరారు. దాదాపు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి మంత్రాలయం, గోకర్ణం, ఉడిపి, శృంగేరి, ధర్మస్థలి, శ్రీరంగపట్నం, శ్రీశైలం, మహానంది, పళని, కన్యాకుమారి, రామేశ్వరం, అరుణాచలం, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande