
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ.,10 జనవరి (హి.స.): ఈ ఏడాది మార్చి నుంచి నవంబరు మధ్య 73 మంది రాజ్యసభ సభ్యులు పదవీవిరమణ చేయనున్నారు. దీనిపై రాజ్యసభ సచివాలయం శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా యూపీ నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమబెంగాల్, బిహార్‌ల నుంచి ఐదుగురి చొప్పున, ఏపీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటకల నుంచి నలుగురి చొప్పున, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి ముగ్గురి చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, ఝార్ఖండ్‌ల నుంచి ఇద్దరి చొప్పున, హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల నుంచి ఒక్కొక్కరి చొప్పున పదవీవిరమణ చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ