రికవరీ సొమ్ము తాకట్టు కేసు.. అంబర్పేట్ ఎస్సై భానుప్రకాశ్ రెడ్డి అరెస్టు
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) ఆన్లైన్ బెట్టింగ్ వ్యామోహంలో పడి, అప్పులు తీర్చేందుకు ఏకంగా ఓ కేసులో రికవరీ చేసిన బంగారాన్నే తాకట్టు పెట్టిన ఘటనలో అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సేకరించిన పక్కా ఆధారాల మేరకు ఆయ
అంబర్పేట్ ఎస్సై


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

ఆన్లైన్ బెట్టింగ్ వ్యామోహంలో పడి,

అప్పులు తీర్చేందుకు ఏకంగా ఓ కేసులో రికవరీ చేసిన బంగారాన్నే తాకట్టు పెట్టిన ఘటనలో అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సేకరించిన పక్కా ఆధారాల మేరకు ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా, అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్ రెడ్డి గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో భారీగా డబ్బు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ అప్పులు తీర్చడానికి అడ్డదారి తొక్కిన ఆయన, వివిధ కేసుల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని పోలీస్ స్టేషన్లో భద్రపరచకుండా బయట తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు.

రికవరీ చేసిన ఆభరణాల తాకట్టు కేసు విచారణలో భాగంగా సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించడం లేదని చెప్పడం అధికారులను విస్మయానికి గురిచేసింది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అది పోయిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం రివాల్వర్ మిస్సింగ్ అవ్వడం పట్ల ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. రివాల్వర్ను కూడా ఎక్కడైనా తాకట్టు పెట్టాడా.. లేక ఎవరికైనా అమ్మేశాడా అని ఎంక్వైరీ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande