
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ లో ప్రసంగించాల్సిందిగా యూనివర్సిటీ ఆహ్వానించింది. The India We Imagine అనే థీమ్తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించబోతున్నారు. ఈ కాన్ఫరెన్స్
ఫిబ్రవరి 14న హార్వర్డ్ కెనెడీ స్కూల్లో పాలన, అభివృద్ధి, పబ్లిక్ పాలసీపై, ఫిబ్రవరి 15 హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో వ్యాపారం, ఆంత్రప్రెన్యూర్షిప్, గ్లోబల్ ఎకానమీపై చర్చలు జరగనున్నాయి. డే-2లో ప్రసంగించాలని కేటీఆర్ను నిర్వాహకులు కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు