హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావాలన్నదే నా కల: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) హిజాబ్ ధరించిన మహిళ ప్రధాన కావాలన్నదే నా కల అంటూ ఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ లో జరిగిన ఒక సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గోని ఈ వ్యాఖ్యలు చేశారు. అ
అసదుద్దీన్ ఒవైసీ


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

హిజాబ్ ధరించిన మహిళ ప్రధాన కావాలన్నదే నా కల అంటూ ఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ లో జరిగిన ఒక సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గోని ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే పాకిస్థాన్, భారత రాజ్యాంగాల మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని ఈ సందర్భంగా ఒవైసీ ఎత్తిచూపారు. పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం కేవలం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తి మాత్రమే ఆ దేశ ప్రధాని కాగలరని, కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ పౌరుడైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మేయర్ పదవులను అధిరోహించవచ్చని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను వెల్లడిస్తూ, భవిష్యత్తులో ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన ఒక మహిళ (ఆడబిడ్డ) భారతదేశానికి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపడుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande