కోడిపందాలు,పేకాట ఆడితే ఊరుకోం.. జిల్లా ఎస్పీ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, 10 జనవరి (హి.స.) జిల్లాలో, సరిహద్దులో పేకాట, కోడి పందాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. శనివారం తన కార్యాలయం నుంచి ఒక ప్రకటనను విడుద
భద్రాద్రి ఎస్పీ


భద్రాద్రి కొత్తగూడెం, 10 జనవరి (హి.స.)

జిల్లాలో, సరిహద్దులో పేకాట, కోడి

పందాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. శనివారం తన కార్యాలయం నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిరంతర వాహన తనిఖీలు,సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా గల జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande