ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.. తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జనగణన జరగబోతోంది.. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ వరకు ఇళ్ల వివరాలను సేక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.. తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జనగణన జరగబోతోంది.. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ వరకు ఇళ్ల వివరాలను సేకరించబోతున్నారు.. తొలిదశలో హౌస్ లిస్టింగ్, గణన ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య జరగనుండగా.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి- మార్చి వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు జనగణన అధికారుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా, సబ్‌డివిజనల్, సబ్‌డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande