
అమలాపురం-: , 10 జనవరి (హి.స.)
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో సంక్రాంతి(పర్వదినాల సమయంలో మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడి పందేలు( నిర్వహించేందుకు పందెపు రాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50కు పైగా బరుల్లో జూద క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో వీరేశ్వరస్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేస్తున్న పందెం బరి ఈసారి వీఐపీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సర్వ హంగులతో ఇక్కడ ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక గ్యాలరీలు, వీఐపీల కోసం భారీ షెడ్లు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు బిజీబిజీగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ