
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)
మహిళలు, చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ వారం 03.01.2026 నుండి 09.01.2026 వరకు పలు విస్తృత చర్యలు చేపట్టమని డీసీపీ సృజన కరణం తెలిపారు.
Operation Smile-XII లో భాగంగా సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 49 జెజె చట్టం కేసులు నమోదు చేసి 215 మంది పిల్లలను, అంటే 200 మంది బాలురను మరియు 15 మంది బాలికలను విజయవంతంగా రక్షించగలిగారు . సైబరాబాద్ షీ టీం బృందాలు ఈ వారంలో మొత్తం 127 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 59 మందిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 63 Petty కేసులు నమోదు కాగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ చేశారు. అదేవిధంగా, మహిళల నుండి అందిన 17 ఫిర్యాదులను షీ టీం బృందాలు స్వీకరించాయన్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ సమస్యలును పరిష్కరించే దిశగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు / సీడిఈడబ్ల్యూ (CDEW) కేంద్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా 31 కుటుంబాలను తిరిగి కలిపి, వారి కుటుంబాల్లో వెలుగులను నింపారు.
సైబరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీం బృందాలు మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, మహిళలను నిరంతరం వెంబడించడం, భిక్షాటన, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. మొత్తం 6,615 మంది ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.
అలాగే మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, డయల్ 100, నేరాల నివారణ కోసం 1930 వంటి సేవల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు