చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగులు నేడు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్న
తీవ్ర ఉద్రిక్తత.


హైదరాబాద్, 10 జనవరి (హి.స.) జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగులు నేడు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల భారీ ఆందోళనలో భాగంగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'మహా ధర్నా' చేపట్టాలని వారు నిర్ణయించారు. దీంతో అప్రమత్తం అయిన పోలీస్ శాఖ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం లోకి వెళ్లింది.

అయితే ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనను భగ్నం చేసేందుకు చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. నిరసనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు పోలీసులు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande