
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
న్యూయార్క్‌ఢిల్లీ.,10 జనవరి (హి.స.): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడకపోవడంతోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదని అగ్ర రాజ్య వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. ‘మామూలుగా అయితే ఒప్పందం కొలిక్కి వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే.. ఇది ఆయన (ట్రంప్) ఒప్పందం. దానికి ముగింపు రావాలంటే.. ట్రంప్‌నకు మోదీ కాల్ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోదీ చివరకు ఫోన్ చేయలేదు. మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్‌తో వాటి కంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకు ముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు మేం ఆలోచించడం లేదు. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తున్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్‌నకు కాల్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ