
జయశంకర్ భూపాలపల్లి, 10 జనవరి (హి.స.)
పండుగ సెలవుల్లో సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తమ విలువైన సొత్తు, నివాసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ సూచించారు. ఇళ్లలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు తదితర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి పగలు, రాత్రి వేళల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడతాయని తెలిపారు. పండుగకు ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు