సింగోటం ఆలయ నిధులపై మంత్రి జూపల్లి ఆరా. అధికారులపై ఆగ్రహం
నాగర్ కర్నూలు, 10 జనవరి (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. శనివారం జరిగిన సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గ
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూలు, 10 జనవరి (హి.స.)

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. శనివారం జరిగిన సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ, ఖర్చులను సీఏను పెట్టుకుని ఎందుకు ఆడిట్ చేయలేదని ఆలయ అధికారులను ప్రశ్నించారు.

ఇండెక్స్ లేకుండా బ్యాలెన్స్ సీటును ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారని ఆలయ అధికారులపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande