
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.
పుష్ప-2 సినిమా తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పాను. అలాగే అఖండ 2 సమయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు నన్ను ఎవరూ కలవడం లేదు. పెరిగిన ధరలకు, నాకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనకు పర్మిషన్ ఇచ్చినందుకు తాను చాలా బాధపడ్డానని, ఇంకా గాయపడిన వారి బాబు ట్రీట్మెంట్ కోసం తన సొంత డబ్బులు కూడా ఇచ్చానని, ఆ చేదు అనుభవం వల్లే ఇకపై సినిమా ఇండస్ట్రీ గోలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మంత్రి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..