
ఖమ్మం, 10 జనవరి (హి.స.)
“రెండేళ్ల క్రితం మీరు ప్రజా ఈ ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పాలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని విద్యానగర్ లో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడిన మంత్రి..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడి కష్టాలను పట్టించుకోలేదని, రేషన్ కార్డులు అడిగితే మొహం చాటేశారని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు