రైతు సంక్షేమమే ధ్యేయం.. మంత్రి పొన్నం
సిద్దిపేట, 10 జనవరి (హి.స.) రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండకూడదని, వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వారికి దిశానిర్దేశం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబా
మంత్రి పొన్నం


సిద్దిపేట, 10 జనవరి (హి.స.)

రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండకూడదని, వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వారికి దిశానిర్దేశం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యానవన అధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎరువుల కొరత తలెత్తకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande