తాము సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పనేలేదు.. మంత్రి పొన్నం
సిద్దిపేట, 10 జనవరి (హి.స.) రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడుమ జిల్లాల పునర్వ్యవస్థీకరణ రగడ షురువైంది. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానంటే తాము ఊరుకోబోమని.. రేవంత్ రెడ్డికి కోపం ఉంటే తనపై చూపించాలని కాని సిద్దిపేట ప్రజల మీద కాదంటూ మాజీ మంత్రి హరీశ్
మంత్రి పొన్నం


సిద్దిపేట, 10 జనవరి (హి.స.)

రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడుమ

జిల్లాల పునర్వ్యవస్థీకరణ రగడ షురువైంది. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానంటే తాము ఊరుకోబోమని.. రేవంత్ రెడ్డికి కోపం ఉంటే తనపై చూపించాలని కాని సిద్దిపేట ప్రజల మీద కాదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే హరీశ్ రావుకు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాము సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పనేలేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని.. కనీసం ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేశారని ఫైర్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande