మియాపూర్ భూకబ్జాల పై ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) శేరిలింగంపల్లి మండలం మియాపూర్ మక్తా మహబూబ్ పేట్ సర్వే నెంబర్ 44లో ఆక్రమణల పై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ స్థలం పై గత కొన్నాళ్లుగా వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారంటూ రాష్ట్ర
భూకబ్జాల పై ప్రభుత్వం


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

శేరిలింగంపల్లి మండలం మియాపూర్ మక్తా మహబూబ్ పేట్ సర్వే నెంబర్ 44లో ఆక్రమణల పై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ స్థలం పై గత కొన్నాళ్లుగా వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే సబ్ రిజిస్టార్ ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆయన పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సర్వేనెంబర్ 44లో కబ్జాలకు గురైన స్థలం చుట్టూ భారీ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది ఫెనింగ్స్ వేయడం మొదలు పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande