
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,10 జనవరి (హి.స.)నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్ ఐఈడీ డేటా మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎన్‌ఐడీఎంఎస్) ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశానికి ముందు తరం భద్రతా కవచంగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో జరిగే అన్నిరకాల బాంబు పేలుళ్లను ఎదుర్కొనే సమగ్ర నిరోధక వ్యవస్థగా ఇది పనిచేస్తుందని తెలిపారు. హరియాణాలోని గురుగ్రామ్ సమీప మనేసర్‌లోని ఎన్‌ఎస్‌జీ గారిసన్‌లో నెలకొల్పిన ఈ ఫ్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ దర్యాప్తు సంస్థలు బాంబు దాడులు జరిగిన విధానం, నమూనాలను విశ్లేషించేందుకు ఎన్‌ఐడీఎంఎస్ సమగ్ర సమాచారాన్ని అందిస్తుందన్నారు. దేశం నుంచి మాదకద్రవ్యాల ముప్పును పూర్తిగా తొలగించేందుకు మార్చి 31 నుంచి మూడేళ్ల పాటు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమిత్ షా దిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ