PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్‌
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే (PhonePe), ఆన్‌లైన్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. తన పేమెంట్ గేట్‌వే ప్లాట్‌ఫామ్‌లో వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారుల కోసం ‘PhonePe
PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్‌


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే (PhonePe), ఆన్‌లైన్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. తన పేమెంట్ గేట్‌వే ప్లాట్‌ఫామ్‌లో వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారుల కోసం ‘PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన సాంకేతికత ద్వారా కోట్లాది మంది డెబిట్ , క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ చెల్లింపులను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సులభంగా , భద్రంగా పూర్తి చేసే అవకాశం కలిగింది. డివైజ్ టోకనైజేషన్ (Device Tokenisation) అనే అత్యాధునిక పద్ధతిని ఉపయోగించడం ద్వారా, వినియోగదారులు తమ కార్డ్ వివరాలను ప్రతిసారీ నమోదు చేసే శ్రమను ఇది తప్పిస్తుంది.

ఈ ఫీచర్ యొక్క ప్రధాన విశిష్టత ఏమిటంటే, వినియోగదారులు తమ కార్డును ఫోన్‌పే యాప్‌లో ఒక్కసారి టోకనైజ్ (సేవ్) చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేతో అనుసంధానమై ఉన్న ఏ మర్చంట్ యాప్‌లోనైనా పదేపదే కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు జరపవచ్చు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande