ఒడిశాలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్.. 9 మందికి గాయాలు
ఒడిశా, 10 జనవరి (హి.స.) ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఇండియావన్ ఎయిర్ యాజమాన్యంలోని ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో
చార్టెడ్ ఫ్లైట్


ఒడిశా, 10 జనవరి (హి.స.)

ఒడిశాలోని రూర్కెలా నుంచి

భువనేశ్వర్కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఇండియావన్ ఎయిర్ యాజమాన్యంలోని ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ పైలట్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande