PSLV-C62 ప్రయోగానికి సర్వం సిద్ధం: జనవరి 12న నింగిలోకి
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12 ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV-C62 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లన
PSLV-C62


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

(ISRO) మరో ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12 ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV-C62 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నిర్వహిస్తున్న ఈ 9వ వాణిజ్య మిషన్లో, ప్రధాన ఉపగ్రహం EOS-N1తో పాటు దేశీయ, విదేశీ వినియోగదారులకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం వాహక నౌక అనుసంధానం పూర్తయి, ప్రీ-లాంచ్ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande