
రామగుండం, 10 జనవరి (హి.స.)
సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కీలకసూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీలు, ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరి పాటించాలన్నారు.
ఊరికి వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసే ముందు తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఇళ్లలో, ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? రికార్డింగ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? నైట్ విజన్ సక్రమంగా ఉందా అనే అంశాలను పరిశీలించుకోవాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..