పండగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్: హైదరాబాద్ - విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు!
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 10 అదనపు
ప్రత్యేక రైళ్లు!


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 10 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. సాధారణంగా పండుగ సమయాల్లో రెగ్యులర్ రైళ్లన్నీ నెలల ముందే నిండిపోవడంతో, సొంతూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామంతో తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ నెల 11, 12, 13, 18, 19వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని.. ఇవి ప్రతిరోజూ ఉదయం 6:10 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కోసం ఈ నెల 10, 11, 12, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 2:40 గంటలకు విజయవాడ నుంచి ట్రైన్లు బయలుదేరుతాయని సౌత్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు పేర్కొన్నారు.--------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande