
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)
రాజకీయాల్లో అసలు దేవుడి పేరును
వాడుకునే హక్కు బీజేపీ కి ఎవరిచ్చారని టీపీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి పక్కా ప్రణాళికలతో మున్సిపల్ ఎన్నికల్లో రంగంలోకి దిగుతామని అన్నారు. సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..