మహిళా ఐఏఎస్ పట్ల మీడియా కథనాలను ఖండించిన ఐఏఎస్ సంఘం
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై మీడియాలో వచ్చిన కథనాలను తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా మహిళా అధికారులపై దురుద్దేశపూరితమైన నిరాధార ఆరోపణలతో నిండి ఉందని అనవసర సందేహాలు రేపే ప్రయత్నం
ఐఏఎస్ సంఘం


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై మీడియాలో వచ్చిన కథనాలను తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా మహిళా అధికారులపై దురుద్దేశపూరితమైన నిరాధార ఆరోపణలతో నిండి ఉందని అనవసర సందేహాలు రేపే ప్రయత్నం చేశారని ఖండించింది. ఇటీవల తెలంగాణ కేడకు చెందిన ఓ మహిళా ఐఏఎస్, ఓ మంత్రిపై ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనంపై స్పందించిన ఐఏఎస్ అధికారుల సంఘం నిజాయతీగా పనిచేస్తున్న అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు తగదని నిరాధారణమైన ఆరోపణలు చేసిందుకు సదరు న్యూస్ చానల్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ కంటెంట్ ను అన్ని ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రామకృష్ణారావు, అసోసియేషన్ సెక్రటరీ జయేశ్ రంజన్ లేఖను విడుదల చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande