
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి టికెట్ ధరలను పెంచుతూ తాజాగా తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చింది. అదేవిధంగా జనవరి 11న సాయంత్రం 8 గంటల నుంచి రాష్ట్రంలో స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రదర్శించుకోవచ్చని.. అందుకు టికెట్ రేటును రూ.600గా నిర్ణయించినట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.100 అదనంగా పెంచుకునేందుకు పర్మీషన్ ఇచ్చారు. రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి కూడా సర్కార్ వెసులుబాటును కల్పించింది. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు