పంజాగుట్ట ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) నగరంలోని పంజాగుట్ట దుర్గామల్లేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గోత్రనామాలతో ఆయన అర్చన చేయించారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చన, పూజ చేశారు. కేంద్ర మంత్రి స
బండి సంజయ్


హైదరాబాద్, 10 జనవరి (హి.స.)

నగరంలోని పంజాగుట్ట దుర్గామల్లేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గోత్రనామాలతో ఆయన అర్చన చేయించారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చన, పూజ చేశారు.

కేంద్ర మంత్రి సంజయ్కు ఆలయ కమిటీ స్వాగతం పలికింది. ఆలయంలో కొలువైన దుర్గాభవాని అమ్మవారు, మేధా దక్షిణామూర్తి స్వామిని కూడా ఆయన దర్శించుకుని పూజలు చేశారు. కేంద్ర మంత్రిని పూలమాల, శాలువాతో ఆలయ కమిటీ సత్కరించింది. సుమారు 15 నిమిషాల పాటు శ్రీదుర్గాభవాని ఆలయంలో కేంద్ర మంత్రి గడిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande