
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,10 జనవరి (హి.స.) వాయు కాలుష్యం భారత్‌ను వణికిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చలేని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని వందలాది నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలోని దాదాపు 44 శాతం నగరాలు దీర్ఘకాలిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది గాలిలో నిరంతర ఉద్గారాల వలన కలిగే ఒక నిర్మాణాత్మక సమస్యను సూచిస్తుందని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) తన నివేదికలో పేర్కొంది. వీటిల్లో నాలుగు శాతం నగరాలు మాత్రమే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) పరిధిలో ఉన్నాయని తెలిపింది. శాటిలైట్ డేటా ఆధారంగా, సీఆర్‌ఈఏ దేశంలోని 4,041 నగరాల్లో పీఎం2.5 స్థాయిలను విశ్లేషించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ