
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ.,10 జనవరి (హి.స.), : ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పతనమవడంతోపాటు ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విధించిన ఆంక్షల ప్రభావం భారత బాస్మతి ఎగుమతులపై పడింది. దీంతో రూ.2 వేల కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్ పోర్టుల్లోనే నిలిచిపోయింది. రియాల్ విలువ పడిపోవడంతో ఇరాన్ ప్రభుత్వం ఆహార దిగుమతులపై ఇస్తున్న రాయితీని నిలిపివేసింది. ఈ ప్రభావం భారత్ నుంచి ఇరాన్‌కు ఎగుమతి అయిన బాస్మతి బియ్యంపై పడింది. ముఖ్యంగా బాస్మతి బియ్య ఎగుమతి రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలకు చెందిన మిల్లర్లు ధరలు పడిపోయి, చేతిలో రూపాయి ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌లో ఏర్పడిన కరెన్సీ సంక్షోభంతో అక్కడి ప్రభుత్వం రాయితీలను ఎత్తివేసింది. ముఖ్యంగా ఆహారంపై ఇస్తున్న రాయితీలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి వెళ్లిన ప్రీమియం బాస్మతి బియ్యం అంతర్జాతీయ ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ సానుకూల నిర్ణయం కోసం మిల్లర్లు ఎదురు చూస్తున్నారు. ‘‘రియాల్ పతనంతో ఇరాన్ ప్రభుత్వం కొన్నేళ్లుగా అందిస్తున్న ఆహార సబ్సిడీని నిలిపివేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ