
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
పారిస్/ఢిల్లీ.,10 జనవరి (హి.స.)ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గురువారం భేటీ అయ్యారు. ప్రపంచ పరిణామాలపై ఆయనతో చర్చించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపట్ల మెక్రాన్ సానుకూలతను శుక్రవారం ఆయన ఎక్స్‌లో ప్రశంసించారు. ఫ్రాన్స్, లక్సెంబర్గ్‌లలో ఆరు రోజుల పర్యటనలో ఉన్న జైశంకర్.. గురువారం ఫ్రాన్స్ రాయబారుల సమావేశంలోనూ ప్రసంగించారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతికత, ఇంధన వనరులు, అనుసంధానత వంటి అంశాలే ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిసి ప్రధాని నరేంద్ర మోదీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉంది. సమకాలీన ప్రపంచ పరిణామాలు, మన వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల మెక్రాన్‌కు ఉన్న భావాలను అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ