
తిరుమల, 10 జనవరి (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రం ఇవాళ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఇవాళ ఉదయం వీఐబీ బ్రేక్ దర్శనంలో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav), సినీ నటుడు తనికెళ్ల భరణి పలువురు దర్శించుకున్నారు. ఈ మేరకు దర్శనం పూర్తయిన వెంటనే వారికి రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రశాంతత వెలకట్టలేనిదని, భక్తులందరికీ ఆ గోవిందుని కృపాకటాక్షాలు ఉండాలని నటుడు తనికెళ్ల భరణి ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV