
పిఠాపురం, 10 జనవరి (హి.స.)
పిఠాపురంలోని ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్ కళాశాల మైదానంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు (Peethikapura Sankranthi Mahotsavalu) కన్నుల పండువగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, కళా ఖండాలను, సాంస్కృతిక ప్రదర్శనలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఉత్సవాలను విజయవంతం చేయడంలో కీలక భూమికను పోషిస్తున్న కళాకారులను ఎక్స్ వేదికగా పేరుపేరునా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. తెలుగువారికే ప్రత్యేకమైన సంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్యకళారూపాలతో వారు సందర్శకులను, వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని కొనియాడారు.
సత్యసాయి జిల్లాకు చెందిన ఉరుములు కళారూపాన్ని ముందుండి నడిపించిన ఎస్. వరప్రసాద్, కర్నూలు జిల్లా నుంచి గురువయయాలు కళారూపంతో అలరించిన జె. మల్లికార్జున, లంబాడీ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జి.సునీత, కృష్ణా జిల్లా సంప్రదాయమైన డప్పులు కళారూపాన్ని ఘనంగా ప్రదర్శించిన వి.రాజీవ్ బాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన తప్పేటగుళ్లు ద్వారా జానపద వైభవాన్ని చాటిన కె. మల్లేశ్వర రావులకు ధన్యవాదాలను తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV