విజయ్‌కు స్టాలిన్ మద్దతు- జన నాయగన్‌ వివాదం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ.,10 జనవరి (హి.
actor vijay


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ.,10 జనవరి (హి.స.)సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో విజయ్‌ (Vijay) కథానాయకుడిగా నటించిన ‘జన నాయగన్‌’(Jana Nayagan) సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M K Stalin) విజయ్‌కు మద్దతుగా నిలిచారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు. తాజాగా ఈ జాబితాలో సెన్సార్ బోర్డు కూడా చేరిందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీని కూడా ఆయుధంగా ఉపయోగిస్తోందని.. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ఈ విషయంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు సైతం విజయ్‌కు మద్దతుగా నిలిచారు. తమిళనాడుపై భాజపా తీసుకునే ఏ చర్యనైనా అన్ని పార్టీలు వ్యతిరేకించాలని లోక్‌సభ ఎంపీ జోతిమణి పిలుపునిచ్చారు. కాగా జననాయగన్‌ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ జారీ చేయడంలో జాప్యం వెనక కేంద్ర ప్రభుత్వం ఉందనే ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. సెన్సార్‌బోర్డు నియమ నిబంధనల ఆధారంగా బోర్డు సభ్యులు సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటారని.. దీనిని రాజకీయ దృష్టితో చూడాల్సిన అవసరం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande