తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల , 10 జనవరి (హి.స.) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. చివరి 11 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం ఏకంగా రూ.41.14
తిరుమల


తిరుమల , 10 జనవరి (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. చివరి 11 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం ఏకంగా రూ.41.14 కోట్లుకు చేరింది. ఇక శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్న 67,678 మంది భక్తుల సంఖ్య దర్శించుకున్నారు. అదేవిధంగా 18,173 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. శీఘ్ర దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 2 గంటల శ్రీవారం దర్శనం అవుతోంది. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande