సోమశిల ప్రాజెక్ట్ సందర్శనకు వైసీపీ పిలుపు.. ఉద్రిక్తత
నెల్లూరు, 10 జనవరి (హి.స.) రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వివాదమై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య వాడివేడి చర్చ సాగుతోంది. ఈ క్రమంలో సోమశిల ప్రాజెక్ట్ (Somasila Project) సందర్శనకు వైసీపీ (YCP) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో (Nellore) రాజ
ycp-calls-for-visit-to-somasila-project-tension-512707


నెల్లూరు, 10 జనవరి (హి.స.)

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వివాదమై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య వాడివేడి చర్చ సాగుతోంది. ఈ క్రమంలో సోమశిల ప్రాజెక్ట్ (Somasila Project) సందర్శనకు వైసీపీ (YCP) పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో నెల్లూరులో (Nellore) రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నాయకుల పట్టుదల, పోలీసుల అడ్డగింతలతో నెల్లూరు ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలను దిగ్భందం చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసుల చర్యలను ప్రతిఘటిస్తున్నారు. సోమశిల వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు అడ్డగించడంతో ఎక్కడికక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమశిల సందర్శన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

అనుమతులు లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని చెబుతున్నారు. దీంతో అటు వైసీపీ నేతలు, ఇటు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సోమశిలకు వెళ్లాల్సిందేనని పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి వైసీపీ నేతలు సోమశిల జలాశయం వద్దకు చేరుకున్నారు.

అక్రమాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా అంటూ కూటమి ప్రభుత్వంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పిలుపు నేపథ్యంలో సోమశిల జలాశయం వద్ద కూడా పోలీసులు భారీగా మొహరించారు. ఆ పార్టీ ముఖ్య నేతల ఇండ్ల వద్ద పహారా కాస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande