ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి: ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, 11 జనవరి (హి.స.) రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు నడుం బిగించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొండపాక బిజెపి మండల అధ్యక్ష
ఎంపీ రఘునందన్


సిద్దిపేట, 11 జనవరి (హి.స.)

రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు నడుం బిగించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొండపాక బిజెపి మండల అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కుకునూర్ పల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన యువత ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, యువత ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande