పొత్తులపై రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు.. స్పందించిన తెలంగాణ జనసేన
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాష్ట్రంలో జనసేనపార్టీతో పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్ఠానానికి కూడా ఈ విషయమే చెప్తామ
రామచంద్రరావు కీలక


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)

తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని,

రాష్ట్రంలో జనసేనపార్టీతో పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్ఠానానికి కూడా ఈ విషయమే చెప్తామన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన - బీజేపీ - టీడీపీ పొత్తు వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో విజయం రావచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పొత్తుపై చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.

రాంచందర్ రావు వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన వింగ్ స్పందించింది. పొత్తులపై జాతీయస్థాయిలో తుది నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దే అని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande