
గోదావరిఖని, 11 జనవరి (హి.స.)
రామగుండం నియోజకవర్గంలో
రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం గోదావరిఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణు గోపాల రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చేసిందో ఆలోచించుకోండి, స్కాములు దోపిడీలు తప్ప పేదవాడికి ఏమి చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ తన ఇంట్లో న్యాయం చేయనోడు ప్రజలకు ఏం చేస్తాడు అని ఎద్దేవా చేశారు. మీ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తూ ఉంటాడని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు ఉంచాలని తపన వారిలో ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు