ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నందిగామ పర్యటన రద్దయినట్లు అధికార వర్గాల సమాచారం.
అమరావతి, 11 జనవరి (హి.స.): ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నందిగామ పర్యటన రద్దయినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 12వ తేదీన ఆయన నందిగామ నియోజకవర్గంలోని మునగచర్ల గ్రామాన్ని సందర్శించాల్సి ఉండగా, అనివార్య కారణాల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసిన
పవన్ కళ్యాణ్


అమరావతి, 11 జనవరి (హి.స.): ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నందిగామ పర్యటన రద్దయినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 12వ తేదీన ఆయన నందిగామ నియోజకవర్గంలోని మునగచర్ల గ్రామాన్ని సందర్శించాల్సి ఉండగా, అనివార్య కారణాల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు సమాచారం.

అధికారికంగా ప్రకటించిన JSP

మునగచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వసతి గృహం ‘గోకులం’ షెడ్డును ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకావాల్సి ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా ఈ ప్రాంతానికి రానుండటంతో జనసేన పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌తో పాటు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande