
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. తలసేమియా అండ్ సికిల్సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కమల హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏసియన్ తలసేమియా కాన్క్లేవ్లో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేషెంట్లు, దేశ, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు, ఇతర నిపుణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన నిర్ధారణలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..