
పెద్దపల్లి, 11 జనవరి (హి.స.)
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ఉదయం మంథని పట్టణ కేంద్రంలో పురవీధుల నుంచి నడుస్తూ... ప్రజలను పలకరిస్తూ స్థానిక పట్టణ ప్రజల బాగోగులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని హనుమాన్, మహా గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ, మంథని నియోజకవర్గ ప్రాంత వాసులు అందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, అప్లైశ్వర్యాలతో ఉండాలని మంత్రి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు