
పెద్దపల్లి, 11 జనవరి (హి.స.)
త్వరలోనే రాష్ట్రo లోని ఎక్కువ
జనాభా ఉన్న పట్టణాలకు అదనంగా ఎమ్మార్వోలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి, రాష్ట్రంలోని లక్ష 50 వేల నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఉన్నాయని ఈ పట్టణాలకు ఒక్కొ తహశీల్దార్ ఉంటారు. కానీ ఇంత ఇంత మందికి ఒకరే తహశీల్దార్ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తావం అన్నారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని కేబినెట్లో చర్చించి అదనంగా పట్టణప్రాంతాల్లో తహశీల్దార్లను కేటాయిస్తామని ప్రకటించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు