మేడారంలో పాప మిస్సింగ్.. సురక్షితంగా చేరదీసిన మంత్రి సీతక్క
ములుగు, 11 జనవరి (హి.స.) మేడారంలోని జంపన్న వాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క పాపను సురక్షితంగా గుర్తించి పోలీస్ కమాండ్ కంట్రోల్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు
మంత్రి సీతక్క


ములుగు, 11 జనవరి (హి.స.)

మేడారంలోని జంపన్న వాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క పాపను సురక్షితంగా గుర్తించి పోలీస్ కమాండ్ కంట్రోల్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పాప పూర్తిగా సురక్షితంగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పోలీస్ కమాండ్ కంట్రోల్కు వచ్చి తమ పాపను తీసుకెళ్లాలని ఆమె సూచించారు. అయితే, మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో చిన్నారి మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్రి సీతక్క స్వయంగా ఆ తప్పిపోయిన చిన్నారిని ఎత్తుకొని పోలీసులకు అప్పగించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande