
సూళ్లూరుపేట, 11 జనవరి (హి.స.)
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈనెల 12న.. సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-62 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ ప్రయోగానికి 24 గంటల ముందు ఆదివారం ఉదయం 10.17కు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ